Wednesday, August 27, 2014


Monday, May 26, 2014

Postal / Sorting Assistants Exam - 2014 Key (Held on: 25.05.2014)

సాక్షి సౌజన్యంతో...... ఇతర వివరాలకు దిగువలింక్ క్లిక్ చేయండి

 http://www.sakshieducation.com/(S(jiqjae55o1bby145jxmniv45))/Story.aspx?nid=72810

1 D   21 A   41 B   61 D   81 C 

2 A   22 D   42 D   62 C   82 C 

3 D   23 B   43 C   63 A   83 D 

4 C   24 B   44 C   64 D   84 B 

5 A   25 B   45 B   65 A   85 B 

6 C   26 C   46 A   66 C   86 C 

7 D   27 A   47 B   67 B   87 D 

8 B   28 B   48 D   68 D   88 C 

9 C   29 D   49 C   69 A   89 A 

10 A  30 C  50 A   70 D   90 A 

11 D  31 B   51 A  71 C   91 C 

12 D 32 D   52 C   72 A   92 A 

13 B  33 D   53 A   79 C   93 C 

14 A  34 D   54 A   74 A   94 C 

15 D  35 B   55 C   75 D   95 A 

16 C  36 D   56 A   76 *   96 B 

17 C   37 D   57 C  77 D   97 A 

18 B   38 D   58 B   78 B   98 D 

19 A   39 B   59 D   79 B   99 A 

20 A   40 D   60 B   80 D  100 B 

Note: “*” There is no correct answer in the given options. Correct answer is Grand Father.

Saturday, March 29, 2014

Present Tense (Exercises)

Ex. 1: Present Tenses

Choose the most appropriate answer.

జవాబులకోసం నలుపు భాగాన్ని మౌస్ తో డ్రాగ్ చేయండి.


1. How often does Peter go to the swimming pool? – 
He ------- to the swimming pool every day. He likes swimming. 
He goes to the swimming pool every day. He likes swimming. (Correct)
 goes
 is going
 has gone
 has been going
2. When is the best time to call you? – 
I usually-------- till nine in the evening. Call me around ten, if you can. 
I usually work till nine in the evening. Call me around ten, if you can. (Correct)
 work
 am working
 have worked
 have been working
3. Let's ask Anna to make apple pie for dessert. She ------great apple pies. 
Let's ask Anna to make apple pie for dessert. She makes great apple pies. (Correct)
 makes
 is making
 has made
 has been making
4. Please be quiet. My children -------- now. 
Please be quiet. My children are sleeping now. (Correct)
 sleeping
 are sleeping
 have slept
 have been sleeping
5. The sun--------- in the east
The sun rises in the east. (Correct)
 rises
 is rising
 has risen
 has been rising
6. Listen! Someone-------- the piano. Do you hear it? – Yes.
Listen! Someone is playing the piano. Do you hear it? – Yes. (Correct)
 plays
 is playing
 has played
 has been playing
7. What is Linda doing? – She ----------dinner.
What is Linda doing? – She is cooking dinner. (Correct)
 cooks
 is cooking
 has cooked
 has been cooking
8. She can't go to the movies. She --------her homework yet. 
She can't go to the movies. She hasn't done her homework yet. (Correct)
 doesn't do
 isn't doing
 hasn't done
 hasn't been doing
9. Tanya ---------France several times. 
Tanya has visited France several times. (Correct)
 visits
 is visiting
 has visited
 has been visiting
10. We ---------this report for four hours. I'm tired. Let's have a break. 
We have been writing this report for four hours. I'm tired. Let's have a break. (Correct)
 write
 are writing
 have written
 have been writing

source:  usefulenglish.ru

Wednesday, March 26, 2014

Practice (Tense)

(1) It rained heavily while they ------------ home
A.     Are returning B. Returning C. Were returning D. Returned                      Ans: C


ఒక సమయంలో ఒక పని జరుగుతున్నప్పుడు ఒక పని జరిగింది అని చెప్పేటప్పుడు జరిగిన పనిని simple past లో ఆ time లో జరుగుతూవున్న పనిని past continuous లో వ్రాయాలి.  .ఇలా simple past- past continuous కాంబినేషన్ని Exams లో ఇస్తాడని  అని చెప్పాలి.
Clues: (when, while, the moment, as, before వాక్యంలో ఈ పదాలు ఉన్నప్పుడు మీరు ఇలా ఆలోచించండి)
Examples:
  • When he came home, she was cooking
  • I found this letter, while I was cooking
  • He came, when I was listening to the radio
  • The old man met with an accident, as he was walking
  • They were quarreling, the moment their father came 
2) When the doctor touched the patient, he ----------
    A     Had already died B. Already died C. Already dead D has already did 
                               Ans: A
    గతంలో అనగా గడచిన కాలంలో రెండు పనులు జరిగినప్పుడు మొదట జరిగిన పనిని Past perfect లోనూ, తరువాత జరిగిని పనిని simple past లోనూ వ్రాయాలి.  ఇక్కడ డాక్టర్ టచ్ చేయడమనేది తరువాత జరిగినపని. so ఇది simple past లో ఉన్నది. ముందు జరిగిన పని చనిపోవడం కాబట్టి దానిని మనం past perfect లో వ్రాయాలి. కనుక జవాబు .... had already died.
Clues: ( before, after, already when)
Examples:
  •    After Raju had left, I reached his house.
  •    I went to his house after he had already gone out.
  •    He reached the cinema after the film had started
  •    When he reached the railway station, the train had already left.
(3)  ----------- he attend classes last week?
        A. has    B. Did   C. Wasn’t    D. Had 
                   ANS:   B
ఇది  ఒక Interrogative Sentence ... ఇది Simple past లో వున్నది. అసలు దీనికి Assertive Sentence ఏమిటో చూద్దాము. He attended classes last week.  simple past లో ప్రశ్నా వాక్యం ఇలా ఏర్పడుతుంది.. Did(Helping Verb) + subject+ V1+object... So.... Did he attend classes last week?
(సశేషం)




Tuesday, March 25, 2014

Postal / Sorting Assistants

నమస్తే!

త్వరలో జరగబోవు Postal Assistants నియామకానికి సంభందించిన పరీక్షలో ఇంగ్లిష్ విషయంగా మనము ఎదుర్కొబోయే అంశాలను చూద్దాము.. ఇంచుమించు అన్ని పోటీ పరీక్షలకు ఈ దిగువ చాప్టర్స్ లో విషయ పరిజ్ఞానము మనకు అవసరమవుతుంది. ఒకొక్క చాప్టర్ ని మనము సమగ్రంగా తెలిసికుంటూ Exams లో ప్రశ్నలు ఎలారావడానికి అవకాశము వుందో కూడా చూద్దాము..  విజయీభవ... 

English Syllabus

  • Tense
  • Articles
  • Prepositions
  • Conjunctions
  • Adverbs
  • Active and Passive Voice
  • Direct and Indirect Speech
  • Synonyms
  • Antonyms
  • Simple, compound and Complex Sentences
  • One word Substitution
  • Comprehension
ఈరోజు పోస్ట్ లో మనము TENSE విషయాన్ని చూద్దాము 

కాలములకు సంభందించిన వ్యాకరణము అన్ని భాషలలోను అతి ముఖ్యమైన అంశము.ఇంగ్లీష్ విషయముగా ఆలోచిస్తే Tense సెన్స్ ఎవరికైతే ఉంటుందో వారికి ఇంగ్లీష్ దాదాపుగా వచ్చినట్లే. కాకపొతే మనము చదువుకునే రోజులలో ఈ Tense ని పట్టికలద్వారా నేర్చుకుంటాము.ఒక వరుసలో అలా పైవాక్యాన్ని బట్టి వ్రాసుకున్టూ పోతాము. ఇంగ్లీష్ మాస్టారు అన్ని కరక్టే అంటారు. కారణం అవి కరక్టే గనుక.కాని మనము TV చూస్తూనో, వేరే ఎవరితోనో మాట్లాడుతూ కుడా పై వాక్యాన్ని చూస్తూ వ్రాసామని మీరు మరచిపోకూడదు.


                            మిత్రులారా..మీరు పట్టికలు ఆధారముగా Tense నేర్చుకొని సాదన చేయడం తప్పులేదు కాని నిజజీవితంలో మాటలాడటానికి ఆ సాధన మాత్రమె సరిపోదు.వాటిని మీరు ఉచ్చారణ ద్వారానే Practice  చేయ వలసి ఉంటుంది.అది ఎలాగో తరువాత చూద్దాము. ప్రస్తుతం   Tense కి   సంభందించిన  Basics తెలుసుకుందాం.

                   *********     TENSEs 

ఒక పని జరిగిందా,జరుగుచున్నదా, జరగబోవుచున్నదా లేక ఏ పరిస్తితిలో వున్నది తెలియ జేయు verb యొక్క రూపాన్ని TENSE అంటారు. Tense అనే పదము లాటిన్ లోని tempus(time) నుండి పుట్టినది.
ఇంగ్లిష్ లో ముఖ్యముగా 3 Tenses వున్నాయి.
  (1) Present Tense (2) Past Tense (3) Future Tense మరియు ప్రతి ఒకటి కూడా నాలుగేసి రూపాలను కలిగి ఉన్నది... i) Simple ( or Indefinite)...... ii) Continuous (or Progressive)......... iii) Perfect......     iv)Perfect Continuous

Tense ల వివిధ రూపాలు, ఉపయోగాలు
PRESENT TENSE
i)Simple Present: (a) అలవాటుగా చేయు పనులు లేదా తిరిగి తిరిగి చేయు పనులను తెలియజేయడానికి
       Ex: He never wastes his time, I go for a walk every morning, She wears Khadi sarees
                               (b) సామాన్య సత్యాలు,నిత్య సత్యాలు, సామెతలు చెప్పడానికి
      Ex: The Sun rises in the East, All that glitters is not gold, Every river flows into the sea
                               (c) ఒక పరిస్తితిని, నమ్మికను తెలియజేయడానికి.
       Ex: India is the largest democratic state in the world, We believe in democracy
                        (d) ఒక నిర్ణీత పధకము ప్రకారము సమీప భవిష్యత్తులో జరగబోవు పనులకు
      Ex: We go to the cinema tonight, The bus arrives at ten O’clock, When does she come?

ii) Present Continuous Tense: (a) ఖచ్చితముగా మనము మాటలాడుతూ ఉన్న,లేదా వ్రాస్తూవున్న    సమయములో జరుగుతూ ఉన్న పనులను తెలియ జేయడానికి
         Ex: It is getting dark now, I am giving you a lesson in grammar, You are reading this example.
        (b) సమీప భవిష్యత్తులో జరగబోవు పనులను తెలియ జేయడానికి
         Ex: I am visiting the exhibition tonight, He is arriving here tomorrow

iii) Present Perfect Tense: (a) ఇప్పుడే అంటే మనం మాటలాడుతున్న సమయానికి ముందే పూర్తి ఐన పనులను  తెలియజేయడానికి, Ex: He has just gone out, He has given me the book now.

iv) Present Perfect Continuous Tense: గతంలో ఎప్పుడో ప్రారంభమై,ఇంకా కొనసాగుతూవున్న పనులకు
     Ex: She has been waiting for the bus for two hours,He has been working here since 1990
PAST TENSE
(i)simple past: గతంలో జరిగిన ఒక పనిని తెలియ జేయడానికి- సాధారణంగా ఇది గతకాలాన్ని,సూచించే adverbs, adverb phrases తో ఉపయోగించ బడుతుంది...... Ex:I saw him yesterday, I learnt Tamil in Tirupati.
(ii)Past Continuous: గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ వున్న పనిని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది.
    Ex: We were watching the TV all evening yesterday,… The wind was rising then.
(iii)Past perfect Tense: గతంలో ఒకదాని వెంట ఒకటిగా జరిగిన రెండు పనులను తెలియజేయునప్పుడు ముందుగా జరిగిన పనిని సూచించడానికి దీనిని ఉపయోగిస్తాము. తరువాత జరిగిన పనిని Simple Past లో తెలుపుతాము.
   Ex: When I had finished my work, I went home,*  I had written the letter before he arrived
(iv)Past Perfect Continuous Tense:  గతంలో ఒకానొక సమయానికి ముందే ఎప్పుడో ఒక పని ప్రారంభమై ఆ సమయం వరకు ఇంకా జరుగుతూనే వుంది అని చెప్పడానికి ..అలాగే గతంలో ఒక పని జరిగిన సమయానికి ముందే మరొక పని  పని ప్రారంభమై అంతవరకూ కొనసాగుతూ వుంది అని చెప్పడానికి కూడా ఈ Tense ఉపయోగిస్తుంది.
Ex: At 8 O’clock last night I had been reading for 2 hours
     When I saw him, he had been waiting for his friend over half an hour.
FUTURE TENSE
(i)           Simple Future:  భవిష్యత్తులో జరగబోవు పనులను,భవిష్యత్తు గురించి ఊహలు, సందేహాలు వ్యక్తం చేయడానికి దీనికి ఉపయోగిస్తాము. Ex: I shall see you tomorrow, He will be thirty next year,  Perhaps she will come
(ii)          Future Continuous: ఎలాంటి ముందు నిర్ణయం, పధకం లేకుండానే భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ Tense ఉపయోగ పడుతుంది..దీనికీ Present Continuous కీ కొంత పోలిక ఉన్నప్పటికి భేదం కూడా ఉన్నది..........I am seeing Mohan tomorrow అన్నప్పుడు మాట్లాడే వ్యక్తి, మోహన్ మరునాడు కలిసేందుకు ముందుగానే ఏర్పాటు చేసుకున్నారన్నమాట.  I shall be seeing Mohan tomorrow  అన్నప్పుడు వీరి సమావేశానికి ముందు నిర్ణయం ఏర్పాటు ఏదీ లేదు.
(iii)         Future Perfect: భవిష్యత్తులో ఒకానొక సమయానికి ముందు ఒక పని పూర్తి అయివుంటుంది అని చెప్పడానికి
( Furure Time కి ముందు By అనే Preposition సాధారణంగా వస్తుంది) Ex:  I shall have completed my work by the end of next week., He will have been six years at the school by next సుమ్మెర్

(IV)      Future Perfect Continuous:  భవిష్యత్తులో ఒక చెప్పబడిన సమయానికి లేదా ఒక పని ప్రారంభం కావడానికి కొంతకాలం ముందే వేరొక పని ప్రారంభమై అంతవరకు కూడా జరుగుతూనే ఉంటుంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది.........Ex.. By next July we shall have been living here for four years.

తదుపరి  పోస్ట్ లో ప్రశ్నలు ఎలా అడగడానికి అవకాశము ఉన్నదో చూద్దాం...  అప్పటివరకూ సెలవు 


 
Blogger Templates